Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:28 PM

ఓటుతోనే ప్రజాస్వామ్య భవిష్యత్ నాగార్జున కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం

25-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నాగార్జున కళాశాల,స్థానికం ప్రధాన ప్రతినిధి

నాగార్జున కళాశాల స్వయం ప్రతిపత్తి ప్రాంగణంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయకర్త డా. బొజ్జ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా డా. బొజ్జ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని స్పష్టం చేశారు. ఓటును అమ్ముకోవడం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని హెచ్చరించారు. ఓటు ఎంతో విలువైన హక్కని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతతో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ప్రజల నిర్లక్ష్యమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదమని పేర్కొంటూ, ప్రతి ఎన్నికలో భాగస్వామ్యం కావడం తప్పనిసరిగా మారాలని అన్నారు. యువత ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.

స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటు నిజాయితీగా పడాలని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేయడం ద్వారానే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్లు, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ, దేశ సార్వభౌమత్వం కోసం తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.యువతలో ప్రజాస్వామ్య చైతన్యం పెంపొందించేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవం కీలక వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జాజుల దినేష్, డా. అంకుష్, లింగస్వామి, శంకర్, జగదీశ్వర్, శ్రీకాంత్, మహేష్ తదితరులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఓటుతోనే ప్రజాస్వామ్య భవిష్యత్ నాగార్జున కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News