Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:28 PM

ఓటరు ప్రజాస్వామ్యానికి వెన్నెముక జాతీయ ఓటర్ల దినోత్సవంలో అవగాహన

24-01-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హయత్‌నగర్, జనవరి 24:

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు కీలక పాత్ర పోషిస్తాడని ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్ ఇంచార్జి ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం, జాతీయ సేవా పథకం, జాతీయ క్యాడెట్ దళం ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది కె. గోపి శంకర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ఎన్నికల ప్రక్రియలో డబ్బు ప్రభావం రోజురోజుకీ పెరుగుతున్నదని, దీనిని ఎదుర్కోవాలంటే యువత చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నిజాయితీగల అభ్యర్థులను గెలిపించడంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు నమోదు చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని అన్నారు. ఓటు నమోదు, నిజాయితీగా ఓటు వేయడంపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అత్యవసరమని వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఉపప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, అకాడమిక్ సమన్వయకర్త డాక్టర్ బి. నరసింహ, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ డి. శ్రీపతి నాయుడు, అధ్యాపకులు డాక్టర్ వి. నాగరాజ్ యాదవ్, డాక్టర్ ఈ. యాదగిరి రెడ్డి, ప్రొఫెసర్ నాగేంద్ర, జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి డాక్టర్ శారదా దేవి, జాతీయ క్యాడెట్ దళం అధికారి డాక్టర్ ధనరాజ్, శారీరక విద్యాధికారి డాక్టర్ అనిత, గ్రంథాలయాధికారి డాక్టర్ ఆనంద్ దుర్గ ప్రసాద్, డాక్టర్ గీత నాయక్, డాక్టర్ పులి రమాదేవి, డాక్టర్ హవేజ్, డాక్టర్ శ్రీపాద గంగాధర్, శ్రీ మల్లేష్, డాక్టర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటరు ప్రజాస్వామ్యానికి వెన్నెముక జాతీయ ఓటర్ల దినోత్సవంలో అవగాహన

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News