Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:50 PM

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను

22-01-2026 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సొంత ఖర్చుతో వీధిలైటు ఏర్పాటు… ప్రజల హర్షం

స్థానికం ప్రధాన ప్రతినిధి

చిట్యాల మండలంలోని వెలిమేడు గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు నుంచి పోటీ చేసిన బొడ్డుపల్లి కల్పన–శ్రీను స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరిచిపోకుండా, ఓడినప్పటికీ మాట నిలబెట్టుకుని ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.

7వ వార్డులోని ఒక వీధిలో వీధిలైటు లేకపోవడంతో కాలనీ పూర్తిగా అంధకారంలో ఉండేది. ఈ సమస్యను గమనించిన కల్పన–శ్రీను ఎన్నికల ప్రచారంలో భాగంగా, గెలిచినా ఓడినా ఆ వీధిలో లైటు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే, ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తన సొంత ఖర్చుతో వీధిలైటును ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా కల్పన–శ్రీను మాట్లాడుతూ, ఇంతటితో అభివృద్ధి పనులు ఆగిపోవని స్పష్టం చేశారు.

గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధికి పదవులు ఒక్కటే ముఖ్యమికాదని, ప్రజాసేవే తన లక్ష్యమని అన్నారు. గ్రామ ప్రజలు, వార్డు ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు, వార్డు వాసులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తాయి.ఈ కార్యక్రమంలో కునూరు గణేష్, గోలి సాయిరాం, కాలనీవాసులు బుట్టి పురుషోత్తం, లింగస్వామి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News