Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:34 AM

ఓబీసీ కులగణనకు ఢిల్లీలో మహా ధర్నా

ఓబీసీ కులగణనకు ఢిల్లీలో మహా ధర్నా

ఓబీసీ కులగణనకు ఢిల్లీలో మహా ధర్నా
23-03-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూఢిల్లీ,

జాతీయ జనగణనలో ఓబీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ గజ్జెల సత్యరాజ్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గజ్జెల సత్యరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి చేపట్టనున్న జాతీయ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జనగణనలో ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అనే విభాగాలు ఉన్నప్పటికీ ఓబీసీలకు ప్రత్యేక ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు.

ఓబీసీల జనాభా వివరాలు స్పష్టంగా తెలియాలంటే కులగణన తప్పనిసరిగా చేపట్టాలని, వెంటనే జనగణన ఫార్మాట్‌లో ఓబీసీ కాలమ్ చేర్చాలని కేంద్రాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు 29 రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ ప్రతినిధులు, బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఓబీసీ కులగణనకు ఢిల్లీలో మహా ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News