Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

నో హెల్మెట్ -నో పెట్రోల్ పై నార్కట్ పల్లి పోలీసుల విస్తృత అవగాహన

22-01-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు “నో హెల్మెట్ – నో పెట్రోల్” అవగాహన కార్యక్రమాన్ని నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నార్కెట్‌పల్లి పరిధిలోని వివిధ పెట్రోల్ బంకులను పోలీసులు సందర్శించి, హెల్మెట్ ధరించకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయవద్దని బంకు యజమానులు, సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు. హెల్మెట్ తీసుకువచ్చిన తరువాత మాత్రమే పెట్రోల్ అందించాలని తెలిపారు.

అదేవిధంగా, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణరక్షణకు హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.

రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చట్టాన్ని గౌరవిస్తూ హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన పెరుగుతుందని, ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

నో హెల్మెట్ -నో పెట్రోల్ పై నార్కట్ పల్లి పోలీసుల విస్తృత అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News