Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:51 AM

నిధానపల్లి లో బీజేపీ నూతన జెండా ఆవిష్కరణ

నిధానపల్లి లో బీజేపీ నూతన జెండా ఆవిష్కరణ

నిధానపల్లి లో బీజేపీ నూతన జెండా ఆవిష్కరణ
January 18, 2026 04:01 PM 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండల పరిధిలోని నిధానపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు హాజరై జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నుంచి విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లే గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని చెప్పారు. గ్రామపంచాయతీలకు నిధులను నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచే పంచాయతీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుండటం ఇందుకు నిదర్శనమన్నారు.రోడ్లు, కాలువలు, మౌలిక వసతులు సహా అనేక అభివృద్ధి పనులు నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ ఇంచార్జ్ నకిరేకంటి మొగులయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, బీజేపీ సీనియర్ నాయకులు డోగుపర్తి సుభాష్, ఏలే చంద్రశేఖర్, మాడురి ప్రభాకర్ రావు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి అక్కినపల్లి సైదులు, పల్లపు దుర్గయ్య, రాపోలు రమేష్ . మండల ప్రధాన కార్యదర్శి జంగిలి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కంభంపాటి శివరంజన్, బట్టి రమేష్, కార్యదర్శులు గన్నేబోయిన మధు, రేపాక లింగస్వామి, బాత్క నరేష్, శనగొండ మల్లికార్జున చారి, మద్దెలపూరి ఐలయ్య, భువనగిరి వెంకటేష్, పోసబోయిన మాధవ్, చల్ల కార్తీక్ రెడ్డి, నడిగోటి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News