Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:51 PM

నేతాజీ జయంతి సందర్భంగా రామన్నపేటలో ఘన నివాళులు

23-01-2026 338 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

రామన్నపేటస్థానికం ప్రధాన ప్రతినిధి

భారత స్వాతంత్ర్య పోరాటంలో అజేయ ధైర్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని రామన్నపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణ కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో గల నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దిన్ మాట్లాడుతూ… బ్రిటిష్ పాలనను అహింసతో కాకుండా సాయుధ పోరాటంతో ఎదుర్కోవాలన్న ఆలోచనతో ముందుకు సాగిన విప్లవ నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన నేతాజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గం నేటికీ ఆదర్శనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరికే సత్యనారాయణతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, సాల్వేరు అశోక్, బొడ్డు సాలయ్యా, బొడ్డు శంకరయ్య, కోట సుధాకర్, ఆముద లక్ష్మణ్, మన్సూర్ అలీ, నాసర్, గొలుసుల ప్రసాద్, పల్లపు రవి, కేశవదాసు ఉదయ్, మేడి శంకరయ్య, ఇనయతుల్ల బేగ్, మహమ్మద్ రిజ్వాన్ పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు మోటె మహేష్, కొమ్ము రామస్వామి, గొరిగె శేఖర్ తదితరులు హాజరయ్యారు.

Sthanikam

నేతాజీ జయంతి సందర్భంగా రామన్నపేటలో ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News