Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 07:25 PM

నీర్నంలలో ఘనంగా గౌరీ సహిత చంద్రశేఖర స్వామి కళ్యాణ మహోత్సవం

23-01-2026 248 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం నీర్నంల గ్రామంలో గౌరీ సహిత చంద్రశేఖర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది.

కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ప్రేమలత దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. గ్రామ ప్రధమ పౌరులుగా భక్తితో వారు చేసిన ఈ సేవ భక్తుల మనసులను ఆకట్టుకుంది.

ఉదయం గణపతి పూజ, ధ్వజారోహణం, కలశ స్థాపనలు, సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వీధివాడలుగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించడంతో గ్రామమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు గంగుల వెంకట్ రెడ్డి, ఆవుల పద్మ నరసింహ, మాజీ ఎంపీటీసీ రామ్ సునీత, శివకుమార్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, వార్డు సభ్యులు బోయిని ఐలమ్మ, ముత్యాల కిషన్, శానగొండ మల్లికార్జునాచారి, శానగొండ రవళి, కట్ట కుమార్ పాల్గొన్నారు.

అలాగే గ్రామ పెద్దలు వల్లే లింగారెడ్డి, వల్లే వెంకట్ రెడ్డి, బత్తుల మాధవరెడ్డి, వల్లే శేఖర్ రెడ్డి, మస్క్ బాబు, యాదవ సంఘం అధ్యక్షులు ఆవుల క్రాంతి కుమార్, ఆవుల శ్రీధర్, రుద్ర గణేష్, ఆవుల అశోక్, ఆవుల విజయ్, భజన బృందం మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

నీర్నంలలో ఘనంగా గౌరీ సహిత చంద్రశేఖర స్వామి కళ్యాణ మహోత్సవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News