Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:36 PM

నీర్నంల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన నరసన్న

26-01-2026 743 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేంద్ర ప్రభుత్వ అతి ఉత్తమ అవార్డు సొంతం

రామన్నపేట స్థానికం / ప్రధాన ప్రతినిధి

పేదరికాన్ని జయించి పట్టుదలతో శిఖరాలకు చేరిన నీర్నంల గ్రామ కుమారుడు నోముల నరసయ్య మరోసారి గ్రామ ప్రతిష్టను దేశస్థాయిలో చాటాడు. ప్రస్తుతం కొండాపూర్ ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నరసయ్యకు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అతి ఉత్తమ అవార్డు లభించింది.కమాండెంట్ ఎం. రామకృష్ణ చేతుల మీదుగా అవార్డును స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోముల నరసయ్య సేవలు ప్రశంసనీయమని, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సహచరులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు.

గ్రామంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఒక పూట పనికి వెళ్లి, రాత్రి వేళ చదువులు సాగించిన నరసయ్య జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగిన ఆయన, ఉద్యోగాన్ని సాధించిన అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగారు.నరసయ్యను ఆదర్శంగా తీసుకొని నీర్నంల గ్రామం నుంచి ఇరవై మందికి పైగా పోలీసు ఉద్యోగాలు సాధించడం ఆయన పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. స్వయంగా ఆయన కుటుంబంలోనే ఐదుగురు ఉద్యోగాలు చేయడం ఆయన అంకితభావాన్ని చాటుతోంది.

ప్రస్తుతం కొండాపూర్ ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకోవడం గ్రామానికి గర్వకారణమని గ్రామ పెద్దలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నరసన్న సాధించిన విజయం నీర్నంల గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొంటున్నారు.

Sthanikam

నీర్నంల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన నరసన్న

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News