Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:39 PM

నీర్నెములలో ముగ్గుల పోటీల సందడి – విజేతలకు ఘన బహుమతులు

26-01-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కీశేగంగుల పూలమ్మ శ్రీనివాస్ రెడ్డి స్మారకార్థం నిర్వహించిన ముగ్గుల పోటీలు గ్రామాన్ని పండగ వాతావరణంలో ముంచెత్తాయి. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొనడంతో పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి.

గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కట్ట సాత్విక కుమార్‌కు ఐదు వేల పదహారు రూపాయలు, ద్వితీయ బహుమతి నోముల పల్లవికి మూడు వేల పదహారు రూపాయలు, తృతీయ బహుమతి సుర్వి స్వప్నకు వెయ్యి ఐదు వందల పదహారు రూపాయలు ప్రదానం చేశారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన సుర్వి ఉమా, కోయగూర రమ్య, ఆవుల నవ్యలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. వయస్సుతో సంబంధం లేదన్న నిర్వాహకుల పిలుపుకు స్పందించిన చిన్నారులు కూడా పోటీల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారిని గుర్తించి నలుగురు చిన్నారులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అంతేకాకుండా పోటీల్లో పాల్గొన్న నలభై ఏడు మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవల శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, చైర్మన్ నాగటి సునీత, ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ గంగుల వెంకట్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బహుమతులను మాజీ సర్పంచ్ గంగుల వెంకట్ రెడ్డి, శ్రీలత దంపతులు అందజేశారు.

Sthanikam

నీర్నెములలో ముగ్గుల పోటీల సందడి – విజేతలకు ఘన బహుమతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News