Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 03:33 PM

నీర్నెముల: ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం

18-01-2026 308 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మండలంలోని నీర్నెముల గ్రామ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు ఆదివారం గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా చిరు సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రతిభావంతులైన యువతను కూడా అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. ల్యాబ్ టెక్నీషియన్‌గా ఎంపికైన బండ జగన్ మోహన్ రెడ్డి కుమార్తె బండ సౌమ్య, ఎంబీబీఎస్ పూర్తి చేసిన తిరుగుడు మమత మల్లికార్జున్ కుమార్తె తిరుగుడు సాయి హర్షిత, ముత్యాల లింగయ్య రాణి కుమార్తె ముత్యాల దివ్య, నెర్లకంటి యాదయ్య కుమార్తె నెర్లకంటి అఖిలలను సన్మానించారు.సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని, చదువు, ఉద్యోగాల ద్వారా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. యువత తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్న ఊరికి గౌరవం తీసుకురావాలని సూచించారు. అలాగే గ్రామాభివృద్ధికి ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అధ్యక్ష, కార్యదర్శులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగుల సోమేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నోముల యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుర్వి శ్రీనివాస్, తిరుగుడు మల్లికార్జున్, నోముల నరసింహ, గంగుల రామ్ రెడ్డి, నాగటి సోములు, నాగటి స్వామి, నోముల రాజశేఖర్, ముత్యాల మధు, ముత్యాల నవ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీర్నెముల: ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News