Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం – అభినందనలు తెలిపిన నాథన్ డ్యాని

03-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని 30 మార్చి 2026న రాష్ట్ర అసెంబ్లీలో “తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026” బిల్లును ఆమోదించడం అభినందనీయమని నారాయణఖేడ్ మున్సిపల్ కోర్టు న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు నాథన్ డ్యాని తెలిపారు. ఈ చట్టం ద్వారా అన్ని వర్గాల న్యాయవాదులకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు భద్రత కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్‌లకు న్యాయవాదుల సంఘాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో న్యాయవాదులపై కోర్టు బయట దాడులు పెరిగినా సరైన స్పందన లేకపోయిందని, 2021లో మంథని వద్ద న్యాయవాది వామన్ రావు, నాగమణి హత్య ఘటన వంటి దారుణాలు మరువలేనివని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ఈ చట్టం కీలకమై, న్యాయవాదులకు మరింత ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని, భవిష్యత్తులో న్యాయవాదుల భద్రతకు బలమైన రక్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం – అభినందనలు తెలిపిన నాథన్ డ్యాని

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News