Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:41 PM

న్యాయవాదుల హక్కుల కోసం పోరాటమే అజెండా ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావును గెలిపించాలి

27-01-2026 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, స్థానిక ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల మండలి ఎన్నికల్లో ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావుకు మద్దతుగా రామన్నపేటలో కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్రాన్ని సీనియర్ న్యాయవాది ఉయ్యాల హనుమంతు గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, జూనియర్ న్యాయవాదుల సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి శ్రీనివాసరావు అని అన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ చట్టం అమలే ఈ దాడులకు అడ్డుకట్ట అని స్పష్టం చేశారు.జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయల ఉపకార వేతనం, 2019 తర్వాత నమోదు చేసుకున్న యువ న్యాయవాదులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలనే డిమాండ్లతో శ్రీనివాసరావు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అనుభవం, అంకితభావం కలిగిన వ్యక్తిని న్యాయవాదుల మండలికి పంపాలంటే సీరియల్ నెంబర్ 160కు ఓటు వేసి శ్రీనివాసరావును గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, యాదసు యాదయ్య, పాల పరమేష్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాయవాదుల హక్కుల కోసం పోరాటమే అజెండా ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావును గెలిపించాలి

Article Image
రామన్నపేట, స్థానిక ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల మండలి ఎన్నికల్లో ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావుకు మద్దతుగా రామన్నపేటలో కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్రాన్ని సీనియర్ న్యాయవాది ఉయ్యాల హనుమంతు గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, జూనియర్ న్యాయవాదుల సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి శ్రీనివాసరావు అని అన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ చట్టం అమలే ఈ దాడులకు అడ్డుకట్ట అని స్పష్టం చేశారు.జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయల ఉపకార వేతనం, 2019 తర్వాత నమోదు చేసుకున్న యువ న్యాయవాదులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలనే డిమాండ్లతో శ్రీనివాసరావు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అనుభవం, అంకితభావం కలిగిన వ్యక్తిని న్యాయవాదుల మండలికి పంపాలంటే సీరియల్ నెంబర్ 160కు ఓటు వేసి శ్రీనివాసరావును గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, యాదసు యాదయ్య, పాల పరమేష్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News