నారాయణఖేడ్‌లో మైనార్టీ స్మశాన వాటికకు శంకుస్థాపన: ఎంపీ, ఎమ్మెల్యే
నారాయణఖేడ్‌లో మైనార్టీ స్మశాన వాటికకు శంకుస్థాపన: ఎంపీ, ఎమ్మెల్యే
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ పట్టణంలోని ముస్లిం మైనార్టీ స్మశాన వాటిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు.బుధవారం పట్టణ పరిధిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మైనార్టీ స్మశాన వాటికకు వారు కలిసి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ, మైనార్టీ స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం తన నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ దశలవారీగా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసిందని, ఈ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో మైనార్టీలకు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. స్మశాన వాటిక వద్ద నీటి సదుపాయం కోసం బోరు బావి ఏర్పాటు చేస్తామని చెప్పారు.మైనార్టీ షాదీఖాన నిర్మాణానికి రూ.50 లక్షల ప్రతిపాదనను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించామని వెల్లడించారు.మున్సిపాలిటీలో మురుగు కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పట్టణంలో అనుసంధాన రహదారుల అభివృద్ధితో పాటు ప్రధాన రహదారుల విస్తరణ జరుగుతోందని తెలిపారు. పట్టణంలో తాగునీటి కొరత నివారణకు అమృత్ రెండు పథకం ద్వారా రూ.12 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అదనంగా రూ.2 కోట్లతో బోరు బావులు వేయడం ద్వారా నీటి సమస్యను గణనీయంగా తగ్గించామని అన్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.విద్యుత్ సమస్యల పరిష్కారానికి పెండింగ్‌లో ఉన్న నూతన కనెక్షన్లు మంజూరు చేశామని, నాలుగు నూతన ట్రాన్స్‌ఫార్మర్లు మరియు రెండు వందల విద్యుత్ స్తంభాలు మంజూరు చేసినట్లు తెలిపారు. నారాయణఖేడ్‌లో సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించాలని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పదిహేను వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, దారం శంకర్, మాజీ కౌన్సిలర్లు వివేకానంద, హన్మాండ్లు, మైనార్టీ నాయకులు రషీద్, తహేర్ అలీ, మైనోద్దీన్ ఖురేషి, సుబుర్, బారి, వాజీద్, అజీమ్, గౌస్ చిస్తీ, యునుస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మైనార్టీ సంఘాల నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి