Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:19 PM

నారా లోకేష్ జన్మదినానికి మెగా రక్తదాన శిబిరం

19-01-2026 224 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని:

జనవరి 23న నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదోని పట్టణంలోని నిర్మల్ టాకీస్ వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారా–నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.అదే రోజున ఆదోని మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలతో పాటు సుమారు 3,000 మంది విద్యార్థులకు అవసరమైన విద్యా కిట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, యువ నాయకులు మారుతి నాయుడు ఆధ్వర్యంలో అన్ని వర్గాల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా యువ నాయకులు భూపాల్ చౌదరి, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలేని సూర్యనారాయణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, లక్ష్మీనారాయణ, జయరాం, వీరేష్, ఎరుకల హనుమంతు తదితరులు పాల్గొన్నారు. మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.

Sthanikam

నారా లోకేష్ జన్మదినానికి మెగా రక్తదాన శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News