Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:38 AM

నాలుగో వార్డులో ‘Arrive Alive’ అవగాహన — మైనర్లకు టూవీలర్లు నో!

13-04-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

“మైనర్లకు టూవీలర్ వాహనాలు ఇవ్వరాదు… ప్రతి వాహనదారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి” అని ఎస్సై రూపా శ్రీ స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని నాలుగో వార్డులో సోమవారం నిర్వహించిన ‘99 రోజుల ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘Arrive Alive’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నాలుగో వార్డ్ కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై రూపా శ్రీ మాట్లాడుతూ — నిర్లక్ష్యం, అధిక వేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. చాలా మంది ఈ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టూవీలర్ వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నాగేందర్, ములుగు నరసింహ, విజయ్‌తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

నాలుగో వార్డులో ‘Arrive Alive’ అవగాహన — మైనర్లకు టూవీలర్లు నో!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News