Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:23 AM

నల్లంపల్లి గ్రామంలో భక్తి సందడి.. రేణుక ఎల్లమ్మ తల్లి అభిషేకం

11-05-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అభిషేక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు. మే 12, 2026 మంగళవారం ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి గ్రామంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎర్రే గొల్ల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, గ్రామ సుభిక్షం కోసం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో శాంతి, ఐక్యత, పంటల సమృద్ధి నెలకొనాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గ్రామంలోని చిన్నా పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని నిర్వాహకులు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.

Sthanikam

నల్లంపల్లి గ్రామంలో భక్తి సందడి.. రేణుక ఎల్లమ్మ తల్లి అభిషేకం

Article Image

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అభిషేక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు. మే 12, 2026 మంగళవారం ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి గ్రామంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎర్రే గొల్ల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, గ్రామ సుభిక్షం కోసం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో శాంతి, ఐక్యత, పంటల సమృద్ధి నెలకొనాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గ్రామంలోని చిన్నా పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని నిర్వాహకులు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News