Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:26 PM

నల్గొండలో ఉద్యోగాల పేరిట భారీ మోసం – పోలీసుల దాడులకు సిద్ధం

03-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి రావడంతో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మోసగాళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దేవాదాయ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, ఒక్కొక్కరి నుంచి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసిన గ్యాంగ్ కార్యకలాపాలు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మండలాల వారీగా ఏజెంట్లను నియమించి చైన్ సిస్టమ్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ ముఠా చేతిలో వందలాది మంది నిరుద్యోగులు మోసపోయినట్లు సమాచారం. బాధితులు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు. నకిరేకల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్ల వద్ద బాధితుల రద్దీ పెరుగుతోంది.

బాధితుల ఫిర్యాదుల మేరకు పలువురు నిందితులపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారులు గోవాకు పరారైనట్లు సమాచారం అందుతోంది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి.

జిల్లాలో కలకలం రేపుతున్న ఈ ఉద్యోగాల మోసం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నిరుద్యోగులు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Sthanikam

నల్గొండలో ఉద్యోగాల పేరిట భారీ మోసం – పోలీసుల దాడులకు సిద్ధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News