Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:41 AM

నల్గొండ ఎన్నికల్లో డబ్బు vs ధర్మం యుద్ధం! మీ ఓటే, మీ భవిష్యత్తు

నల్గొండ ఎన్నికల్లో డబ్బు vs ధర్మం యుద్ధం! మీ ఓటే, మీ భవిష్యత్తు

నల్గొండ ఎన్నికల్లో డబ్బు vs ధర్మం యుద్ధం! మీ ఓటే, మీ భవిష్యత్తు
February 01, 2026 03:04 AM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్గొండ ఎన్నికల్లో డబ్బు vs ధర్మం యుద్ధం! మీ ఓటే, మీ భవిష్యత్తు

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 48 వార్డుల ఎన్నికలు బయటికి పార్టీల పోటీగా కనిపించినా, లోపల రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య మల్టీ కోట్ల లాభాల రహస్య ఆటగా పరిణమించాయి. రాజకీయ పార్టీల పేరుతో స్వప్రయోజనాల కోసం ఎత్తుకై పై ఎత్తులు వేసుకుంటూ, ఎదుటి పార్టీల అభ్యర్థులను తమ అనుకూలంగా మలుపెట్టుకుంటూ వ్యాపార సంక్షేమం సాగుతోంది. అధికార పార్టీ మాత్రమే కాదు, ప్రతిపక్షాలైన పార్టీలు కూడా ఈ ఆటలో పాలుపంచుకుంటున్నాయి. "అధికారం ఎవరికైనా వచ్చినా అందరం కలిసి లాభాలు పంచుకుందాము" అనే రహస్య ఒప్పందంతో సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు.పోటీ చేసే అభ్యర్థుల నిజ రూపం: కార్పొరేషన్‌లో పోటీ చేసే అభ్యర్థులు అందరూ రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరిన వ్యాపార మాఫియా. వారి నిజ లక్ష్యం పట్టణ అభివృద్ధి కాదు - నూతన లేఅవుట్ల అనుమతులు, భవన అనువుకలు, ల్యాండ్ కన్వర్షన్ల ద్వారా మల్టీ కోట్ల లాభాలు. ప్రజలు రోజూ ఎదుర్కొంటున్న రోడ్లు, నీటి సమస్యలు, చదరపు, పార్కులు, రవాణా వంటి సమస్యలపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. పరిశీలకులు హెచ్చరించారు - ఈ ఎన్నికలు పూర్తిగా వ్యాపార ఆటగా మారాయి, ప్రజల ప్రయోజనాలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు.అని విమర్శలు వస్తున్నాయి. అమాయక కార్యకర్తల దారుణ గతి: సాధారణ కార్యకర్తలు, అమాయక అభ్యర్థులను పూర్తిగా పూడ్చిపెట్టి, దివాలా తీస్తున్నారు. అనుభవం గడిచిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు పోటీ నుంచి తప్పుకుంటే, మిగిలినవారు "ఉన్నామా అన్నట్టు" అసలటి పోటీ లేకుండా ఉంటున్నారు. "ఏ పార్టీ గెలిచినా మా వ్యాపార లాభాలు కాపాడుకుంటాము" అనే పూర్తి నమ్మకంతో అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది అనేది జగమెరిగిన సత్యం.

ప్రజల్లో ఓటు కొనుగోలు భయం: "ఈ పార్టీకి ఓటు వేస్తే మేలు? ఆ పార్టీకి వేస్తే మేలు?" అనే ఆలోచనల్లో ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా తమ అభ్యర్థులకు "మేము గెలిపిస్తాము" అని భరోసా ఇవ్వలేకపోతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలంటే అధికారులు నిర్వహిస్తున్నారు, కానీ ప్రజల ప్రయోజనాలకు , కనీస సౌకర్యాలకు ఎటువంటి ఆశలు లేవు.ఓటరులకు ప్రత్యేక సలహా: మీరు ఈ డబ్బు పంచే వారిని గుర్తించండి. వారి డబ్బులు మీ పన్ను డబ్బులు, మీ ఆస్తులను కొల్లగొట్టినవి. ధర్మంగా, నిజాయితీగా, సేవా భావంతో పని చేసే అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయండి. డబ్బు తీసుకుని మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోవద్దు. ఇప్పుడు వేసే ఓటు ఐదు సంవత్సరాలవరకు నీ భవిష్యత్ ను నిర్ణ ఇస్తున్నది ఓటరు మహాశయా!

48 వార్డులకు 576 అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో నల్గొండ పట్టణ ప్రజలు తమ భవిష్యత్తును ఎంచుకునే అవకాశం పొందారు. డబ్బు కొనే రాజకీయంలో పడి మోసపోకుండా నిజాయితీ, సేవా భావం ఉన్నవారిని ఎన్నుకోండి. ఎన్నికల తర్వాత మీ ప్రాంతంలో రోడ్లు, నీరు, చదరపు, పార్కులు, రవాణా సౌకర్యాలు రావాలంటే ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోండి. నల్గొండ పట్టణం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలంటే ప్రజలు చురుకుగా ఓటు వేయాలి. వ్యాపారుల మోసాలను గుర్తించి, ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. మీ ఓటు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు. డబ్బు కాకుండా ధర్మాన్ని ఎంచుకోండి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News