Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

నల్గొండ దివ్యాంగులకు శుభవార్త ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం

21-01-2026 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ దివ్యాంగులకు

ఈనెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

నల్గొండ జిల్లా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను 100 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 30వ తేదీ లోగా tso.bmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

ప్రభుత్వ సహకారంతో అమలులో ఉన్న ఈ పథకం ద్వారా దివ్యాంగుల ఆత్మనిర్భరతకు తోడ్పాటు అందించడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు బిజినెస్ బ్యాటరీ సైకిళ్లు, ట్యాబ్స్, మూడు చక్రాల రిక్షాలు, వీల్ చైర్లు, చంక కర్రలు, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్ తదితర అవసరమైన ఉపకరణాలను సహకార సంస్థ ద్వారా ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు.

అర్హత ప్రమాణాలు పూర్తిచేసిన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే సంబంధిత మండల కార్యాలయాలను సంప్రదించాలని జిల్లా సంక్షేమ అధికారి సూచించారు.

ఈ పథకం ద్వారా దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడి, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

నల్గొండ దివ్యాంగులకు శుభవార్త ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News