Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

"నల్గొండ పోలీసుల అలర్ట్: నకిలీ బంగారం మోసాలకు ఆరుగురు అరెస్ట్!"

04-01-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

"నల్గొండ పోలీసుల అలర్ట్: నకిలీ బంగారం మోసాలకు ఆరుగురు అరెస్ట్!"

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి డి.డి.దాసు : నల్గొండ, జనవరి 3: నల్గొండ వన్ టౌన్ పరిధిలో 'నకిలీ బంగారం' పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన ఆరుగురు రాజస్థాన్ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్, సీఎస్ సిబ్బంది రెండు బృందాలు ప్రకాశం బజార్‌లో ఆకస్మిక ఆపరేషన్నిర్వహించారు.

5 లక్షల మోసం: వినాయక కిరాణా షాపు యజమాని బురిడి: డిసెంబర్ 16న నెహ్రూ గంజ్ వద్ద వినాయక కిరాణా షాపు యజమానిని "పాత బంగారం తక్కువధరకు" అని మోసం చేసి 5 లక్షలు కొట్టిన కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. కతాలగూడెం శివారులో ప్లాస్టిక్ వ్యాపారం పేరిట గుడిసెలు వేసుకుని ఓకుటుంబమే ఈ మోసాలు చేస్తూ తిరిగినట్లు తేలింది.

1.5 లక్షల నగదు, అర కేజీ నకిలీ బంగారం స్వాధీనం:అరెస్ట్ చేసిన ఆరుగురు నేరస్తుల నుంచి 1.5 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు, అర కేజీ నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ జాలుర్ జిల్లా భీల్మాల్, రాంసిన్, లెదర్ మేర్ నివాసులైన రమేష్ కుమార్, రాజారామ్, మహేంద్ర కుమార్, మానారామ్, సురేశ్ కుమార్, దేవారామ్‌లు నేరస్తులు. పురన్ కుమార్ పరారీ.

మోసగాళ్ల తీరు: ఈ 3 గుర్తింపు సంకేతాలు గమనించండి

  1. "లంకె బిందెలు దొరికాయి" - పొలం/ఇల్లు తవ్వుతూ పాత బంగారం దొరికిందని, పోలీసుల భయంతో తక్కువ ధర అని నమ్మిస్తారు.
  2. అత్యవసరం కలిగించడం - "అర్జెంట్ డబ్బు కావాలి, ఆపరేషన్ ఉంది" అని తొందర పెడతారు.
  3. సాంపుల్ టెస్ట్ - మొదట చిన్న నిజమైన బంగారం ఇచ్చి నమ్మకం కలిగించి, తర్వాత నకిలీ బిస్కెట్లు ఇస్తారు.

పోలీసుల హెచ్చరిక: ఈ నియమాలు పాటించండి

✅ అపరిచితుల నకిలీ బంగారం మాటలు నమ్మవద్దు

✅ హాల్‌మార్క్, రసీదు ఉన్న షాపుల్లోనే కొనండి

✅ సందేహాస్పదంగా ఉంటే Dial 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి

సిబ్బంది కి అభినందనలు :వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, సీఎస్ ఎస్ఐ విజయ్ కుమార్, ఎస్సైలు లచ్చిరెడ్డి, వెంకట నారాయణ, సిబ్బందిని డీఎస్పీ శివరాం రెడ్డి అభినందించారు.

"దురాశ దుఃఖానికి చేటు! మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి" అని కె. శివరాం రెడ్డి, డీఎస్పీ, నల్గొండ తెలియచెశారు .

Sthanikam

"నల్గొండ పోలీసుల అలర్ట్: నకిలీ బంగారం మోసాలకు ఆరుగురు అరెస్ట్!"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News