Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:37 PM

నకిరేకల్‌లో రైతులకు యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ

26-01-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం పాల్గొని లబ్ధిదారులైన రైతులకు సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణతో సాగు వ్యయం తగ్గి, దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతులకు అండగా నిలిచేలా ప్రభుత్వం సబ్సిడీలను అమలు చేస్తున్నదన్నారు.

గత ప్రభుత్వ పాలనలో రైతులకు సబ్సిడీలు లేకుండా రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ముంచారని విమర్శించారు. ఇంటింటికి నల్లా వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిందని తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర నివాస పాఠశాల నిర్మాణం చేపట్టామని, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన విద్యా, వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

నకిరేకల్‌లో రైతులకు యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News