Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:35 PM

నాగార్జున పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 243 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రాజ్యాంగ విలువలపై ఓయూ అధ్యాపకుల పిలుపు

స్థానికం ప్రధాన ప్రతినిధి

నాగార్జున పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డబ్ల్యు. మాయాదేవి, హిందీ విభాగ అధ్యయన మండలి సభ్యురాలు డాక్టర్ కె. సంగీత వ్యాస్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులు, విధులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి ఆదర్శంగా నిలిచే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం తీసుకొచ్చే విధంగా జీవితాన్ని మలచుకోవాలని పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన వ్యాస రచన, క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రలతో కూడిన పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధి డాక్టర్ నాగరాజు, ప్రధానోపాధ్యాయురాలు నకిరేకంటి రేఖ, ఉపాధ్యాయులు అక్రం, సంధ్య, స్వప్న, విజయశ్రీ, లత, వినీషా, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

నాగార్జున పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News