Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:05 PM

మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

17-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ప్రక్రియ పూర్తి

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరిస్తూ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ ఖరారు ప్రక్రియను కలెక్టర్ పారదర్శకంగా నిర్వహించారు. నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో రిజర్వేషన్ల కేటాయింపు జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో

భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు,

ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు,

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు,

చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులు,

పోచంపల్లి మున్సిపాలిటీలో 13 వార్డులు,

మోత్కూర్ మున్సిపాలిటీలో 12 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు.

మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా కేటాయింపులు చేపట్టామని కలెక్టర్ హనుమంతరావు వివరించారు. ఈ ప్రక్రియ పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీవోలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News