Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:09 PM

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి – ఎమ్మార్వోకు వినతిపత్రం

16-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మున్సిపల్ ఎన్నికలను బీసీలకు చట్టబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిట్యాల ఎమ్మార్వో విజయ మేడం కి బీసీ సంఘాల నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం మాట్లాడుతూ—ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేసి మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని కోరారు.బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ రంగాల్లోనే కాకుండా స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ శాశ్వత రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ అవసరమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం ఇప్పటికీ 14 శాతం దాటకపోవడం వారి రాజకీయ వెనుకబాటుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D(6) ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని తెలిపారు. ఈ అధికారం ఆధారంగా అసెంబ్లీలో ఇప్పటికే చట్టం చేసిన నేపథ్యంలో వెంటనే జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.సుప్రీంకోర్టు అగ్రకులాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన సందర్భంగా 50 శాతం సీలింగ్‌ను సడలించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందిరా సహానీ కేసులో కూడా ఎంపిరికల్ డేటా ఉంటే 50 శాతం పరిమితిని అధిగమించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కులాల వారీ జనాభా లెక్కలు, అసెంబ్లీ చట్టం ఉన్న నేపథ్యంలో ఈ కేసు న్యాయపరంగా, రాజ్యాంగపరంగా పూర్తిగా బలంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.కావున ఎలాంటి రాజ్యాంగ, న్యాయపరమైన అడ్డంకులు లేకపోవడంతో బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, మనీల్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి – ఎమ్మార్వోకు వినతిపత్రం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News