Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:54 AM

మున్సిపాలిటీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు

19-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి:

పోచంపల్లి మున్సిపాలిటీలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పోచంపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయో, వార్డుల వారీగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు పూర్తిగా ఉన్నాయా లేదా అన్నది క్షుణ్నంగా పరిశీలించాలని సూచించారు.ఎన్నికల నిర్వహణకు నియమించబడిన అధికారులు, సిబ్బంది అందరూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధులను అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తయ్యిందా లేదా అన్న అంశాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలా పకడ్బందీగా నిర్వహించారో అదే స్థాయిలో మున్సిపాలిటీ ఎన్నికలను కూడా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపాలిటీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News