Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:04 PM

మున్సిపల్ ఓటర్ల జాబితాపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు

24-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అభ్యంతరాలపై కలెక్టర్ పరిశీలన

ఏడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో కుల రిజర్వేషన్, వార్డు వారీ కేటాయింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించలేదని ఆరోపిస్తూ సూర్యాపేటకు చెందిన డి శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆర్ శ్రీధర్ వాదనలు వినిపించగా, ప్రభుత్వం, ఎన్నికల సంఘం, మున్సిపల్ అధికారుల తరఫున సంబంధిత న్యాయవాదులు వాదనలు వినిపించారు.వాదనలు విన్న అనంతరం కోర్టు స్పందిస్తూ, పిటిషనర్ జనవరి 19న ఇచ్చిన అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని ఆదేశించింది. కుల రిజర్వేషన్, వార్డు వారీ రిజర్వేషన్ కేటాయింపుల్లో ఉన్న లోపాలపై పిటిషనర్‌కు వాదించే అవకాశం కల్పించి, చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌కు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేయాలని, ఆదేశాల ప్రతిని స్వీకరించిన తేదీ నుంచి ఏడు రోజుల్లోపు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఫిబ్రవరి 20న మళ్లీ విచారణకు లిస్టు చేసింది.

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ ఆదేశాలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తుది ఓటర్ల జాబితా, కుల రిజర్వేషన్ అంశాలపై కలెక్టర్ తీసుకునే నిర్ణయంతోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిణామాలతో సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై తాత్కాలిక ఉత్కంఠ నెలకొంది.

Sthanikam

మున్సిపల్ ఓటర్ల జాబితాపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News