Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:55 AM

మున్సిపల్ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం
22-01-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పూర్తి ఏర్పాట్లతో ముందుకు రావాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికారులతో సమీక్ష

స్థానికం ప్రధాన ప్రతినిధి

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి లోపాలకు తావు లేకుండా సజావుగా సాగాలని అధికారులకు ఆదేశించారు.గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఆమె ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉంచాలని సూచించారు.రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్, జోనల్ అధికారుల నియామకం, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాల ఏర్పాటు, పీఓలు–ఓపీఓలకు శిక్షణ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సామాగ్రి పంపిణీ–స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 104 వార్డులకు గాను మొత్తం 212 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి వివరాలను ఇప్పటికే టీ–పోల్‌లో నమోదు చేసి, పోలింగ్ కేంద్రాలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించినట్లు వెల్లడించారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం జరుగుతోందని, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి పూర్తిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు చేసేలా ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలను నియమిస్తున్నామని చెప్పారు. నామినేషన్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు.ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని అధికారులను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News