Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

మున్సిపల్ ఎన్నికల విధుల్లో అప్రమత్తత తప్పనిసరి

30-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రిసైడింగ్ అధికారులే ఎన్నికల విజయానికి కీలకం

మున్సిపాలిటీ ఎన్నికల విధుల పట్ల ప్రిసైడింగ్ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధులకు నియమించబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధుల్లో చేరాలని, ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. పోలింగ్‌కు సంబంధించిన సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ పెట్టెలను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని సూచించారు.

ముఖ్యంగా పోలింగ్ పెట్టె తెరవడం, మూసివేయడం, ముద్ర వేయడం వంటి ప్రక్రియల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.పోలింగ్ సామగ్రి స్వీకరణ మొదలుకొని పోలింగ్ ముగిసే వరకు ప్రతి దశలో అప్రమత్తత అవసరమన్నారు. ఓటర్లకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించాలన్నారు.ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా సాగాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, మాస్టర్ శిక్షకుడు నర్సిరెడ్డి, ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల విధుల్లో అప్రమత్తత తప్పనిసరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News