Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 02:29 AM

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుడకుడలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

07-02-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రశాంత, స్వేచ్ఛాయుత ఎన్నికలకే చర్యలు

ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి

ఈనెల 11న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో భద్రతపై నమ్మకం కల్పించడం, ఎన్నికల నియమాలను పటిష్టంగా అమలు చేయడం, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ గ్రామంలో భారీ పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులు, సమస్యాత్మక ప్రాంతాలు, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల మీదుగా పోలీస్ బలగాలు కవాతు నిర్వహించాయి.

ఈ సందర్భంగా డివిజన్ డిఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసినా, అసాంఘిక శక్తులు తలదూర్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మున్సిపాలిటీ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రజల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం అయ్యేలా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ మరియు రూరల్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, రాజశేఖర్, సూర్యాపేట సర్కిల్ ఎస్సైలు, పట్టణ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుడకుడలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News