అమెరికాలోని బోస్టన్ నగరంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సోదరుడు, స్ప్రెడ్ ఇంటర్నేషనల్ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, రాష్ట్ర పర్యాటక రంగ విస్తరణతో పాటు ప్రవాస తెలంగాణవాసుల సహకారం వంటి అంశాలపై సానుకూలంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను పటేల్ శ్రీధర్ రెడ్డి అభినందించారు.ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగిందని, రాష్ట్రాభివృద్ధికి తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి