Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు.. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:23 PM

మూసి కెనాల్ బ్రిడ్జ్ శిథిలం… ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం

14-01-2026 254 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

లారీ ప్రమాదం తర్వాత నిలిచిన స్కూల్ బస్సు సేవలు

గ్రామస్థుల అభ్యర్థనపై బ్రిడ్జ్ పరిశీలించిన ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

కొన్ని రోజుల క్రితం పిల్లలమర్రి గ్రామం పరిధిలోని మూసి కెనాల్ బ్రిడ్జ్ వద్ద జరిగిన లారీ ప్రమాదం తర్వాత బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరడంతో స్కూల్ బస్సులు రాకపోకలు నిలిచిపోయి, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల అభ్యర్థన మేరకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సోమవారం సంఘటన స్థలాన్ని సందర్శించి బ్రిడ్జ్ పరిస్థితిని పరిశీలించారు. ఈ బ్రిడ్జ్ మీదుగా రోజూ విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ప్రయాణిస్తారని, ప్రస్తుతం బ్రిడ్జ్ దెబ్బతినడం వల్ల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని లేదా తాత్కాలిక ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జ్ మరమ్మతులకు అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భద్రతే ముఖ్యమని, ముఖ్యంగా విద్యార్థుల రాకపోకలకు తక్షణ పరిష్కారం అవసరమని పేర్కొన్నారు.

Sthanikam

మూసి కెనాల్ బ్రిడ్జ్ శిథిలం… ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News