Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:58 PM

మొబైల్ రీల్స్ మోజులో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం

29-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నల్గొండ:

కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మొబైల్ ఫోన్ మోజులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, బస్సు డ్రైవర్ మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ వాహనం నడిపినట్లు సమాచారం. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఎక్కింది. ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురికావడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు.

అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలు కాగా, వారిని స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించారు. గాయపడిన ప్రయాణికులంతా అదే బస్సులో ప్రయాణాన్ని కొనసాగించి గమ్యస్థానాలకు చేరుకున్నారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరగడానికి తృటిలో తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మొబైల్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

మొబైల్ రీల్స్ మోజులో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News