Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ

23-05-2026 217 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో దివ్యాంగుల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం సభ్యులు కలిసి దివ్యాంగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దివ్యాంగులు విద్య, ఉపాధి అవకాశాలు, పెన్షన్లు, స్వయం ఉపాధి పథకాలు, హాస్టల్ మరియు రవాణా సౌకర్యాలపై మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ.. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పనిచేస్తోందని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ చెరుకు నాగభూషణ్, వీరభద్రయ్య యాదవ్, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, ఉపాధ్యక్షుడు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దానమ్మ, సహాయ కార్యదర్శులు మోదాల సైదులు యాదవ్, వేణుగౌడ్, గుండ్లపల్లి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ

Article Image

హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో దివ్యాంగుల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం సభ్యులు కలిసి దివ్యాంగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దివ్యాంగులు విద్య, ఉపాధి అవకాశాలు, పెన్షన్లు, స్వయం ఉపాధి పథకాలు, హాస్టల్ మరియు రవాణా సౌకర్యాలపై మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ.. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పనిచేస్తోందని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ చెరుకు నాగభూషణ్, వీరభద్రయ్య యాదవ్, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, ఉపాధ్యక్షుడు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దానమ్మ, సహాయ కార్యదర్శులు మోదాల సైదులు యాదవ్, వేణుగౌడ్, గుండ్లపల్లి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News