Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

మంత్రి ఉత్తమ్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

29-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఒంటెద్దు నరసింహారెడ్డిపై యువజన కాంగ్రెస్ ఆగ్రహం........

యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ అజీమ్......

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి చేసిన విమర్శలను కోదాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం కోదాడలో నిర్వహించిన సమావేశంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ అజీమ్ మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసమే నరసింహారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తెలంగాణ భవన్ వేదికగా ఇటువంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు నరసింహారెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నడిగూడెం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుండు మహేందర్, మునగాల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్ళపాటి సాయి, కోదాడ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తోళ్ల ఆనంద్, యువజన కాంగ్రెస్ నాయకులు షేక్ నాగుల్ పాషా, సయ్యద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.......

Sthanikam

మంత్రి ఉత్తమ్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News