Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:30 AM

మిస్సింగ్ కేసుల ఛేదనలో టెక్నాలజీ వినియోగం.కర్నూలు పోలీసుల పనితీరుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడి

24-05-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

FRS సిస్టమ్‌తో కనిపించని వ్యక్తుల గుర్తింపు

కర్నూలు,: మిస్సింగ్ కేసుల ఛేదనలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కర్నూలు పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కనిపించకుండా పోయిన వ్యక్తులను గుర్తించడంలో FRS (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సర్వీసుల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల అనలిటిక్స్ కెమెరాలు ఏర్పాటు చేయగా, కర్నూలు జిల్లాలో 722 మ్యాట్రిక్స్ స్మార్ట్ టెక్నాలజీ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో FRS, ANPR తదితర సాంకేతిక వ్యవస్థలు అమలులో ఉన్నాయని చెప్పారు.

ఈ కెమెరాలన్నీ అమరావతిలోని RTGS కంట్రోల్ రూమ్ ద్వారా CCTNS AP-360 యాప్ సహాయంతో పర్యవేక్షించబడుతున్నాయని, జిల్లా కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ స్టేషన్లతో అనుసంధానించబడినట్లు వివరించారు.

ఇటీవల కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసులో కనిపించకుండా పోయిన వ్యక్తిని మదనపల్లిలో గుర్తించినట్లు తెలిపారు. అలాగే పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో బాధితుడిని తిరుపతిలో, నందవరం పోలీస్ స్టేషన్ కేసులో వ్యక్తిని విజయవాడలో గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

FRS టెక్నాలజీ వ్యక్తుల ముఖాలను స్కాన్ చేసి, పోలీసుల డేటాబేస్‌లోని ఫోటోలతో పోల్చి గుర్తించే వ్యవస్థ అని ఎస్పీ వివరించారు. ఇదే సాంకేతికత ద్వారా పరారీలో ఉన్న నిందితులు, నేరచరిత్ర కలిగిన వ్యక్తుల అనుమానాస్పద కదలికలపై కూడా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వెంటనే అలర్ట్‌లు అందుతున్నాయని తెలిపారు.

Sthanikam

మిస్సింగ్ కేసుల ఛేదనలో టెక్నాలజీ వినియోగం.కర్నూలు పోలీసుల పనితీరుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News