Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:54 PM

మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.....

05-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

రాష్ట్ర పెన్షనర్ల సంఘం అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య......

కోదాడ పెన్షనర్ల సంఘ భవనంలో ఈనెల 7 న శనివారం నిర్వహించే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, సంఘ సభ్యులతో కలిసి బ్రోచర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో నిపుణులైన వైద్య బృందం చే న్యూరో, గుండె, ఆర్థో వైద్యుల బృందం రానున్నారని తెలిపారు. ఈసీజీ, 2డి ఎకో, ఎముకల సాంద్రత వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించబడతాయని ఇట్టి అవకాశాన్ని ఉద్యోగులు,పెన్షనర్లు,సామాన్య ప్రజలు సైతం అన్ని వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోదాడ సంఘ కార్యాలయంలో ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, సెక్రటరీ శ్యాంసుందర్ రెడ్డి, కోదాడ కార్యదర్శి రఘువర ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షులు జానయ్య, విద్యాసాగర్, భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు......

Sthanikam

మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News