Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:34 AM

మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్… ఈ నెలలోనే నోటిఫికేషన్!

03-01-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రాష్ట్రం/స్థానికం ప్రతినిధి

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో, ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో కలిసి కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. దీంతో 11న నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమవుతుందని అంచనా. అయితే సంక్రాంతి పండగ, వరుస సెలవుల కారణంగా ప్రక్రియ ఆలస్యమైతే ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు, ఉపసంహరణ, ప్రచారం తదితర ఎన్నికల ప్రక్రియలు వేగంగా సాగనున్నాయి. మొత్తం మీద 117 మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్… ఈ నెలలోనే నోటిఫికేషన్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News