Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:27 AM

మునిసిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి

08-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అభ్యంతరాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితా విడుదలకు అదనపు కలెక్టర్ ఆదేశాలు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, నిర్ణీత గడువులో త్వరతగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.గురువారం భువనగిరి పురపాలక సంఘ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సందర్శించి మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఫోటో ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఓటరు జాబితాల ప్రకటనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండేలా పర్యవేక్షించాలని, ఒకే కుటుంబానికి చెందిన అర్హులైన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, విచారణ పూర్తిచేసి వార్డు వారీగా జనవరి 12, 2026 న తుది ఓటర్ల జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించాలని ఆదేశించారు.అలాగే జనవరి 13, 2026 న పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రదర్శించి, జనవరి 16, 2026 న పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని మునిసిపల్ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రామలింగం, మేనేజర్, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మునిసిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News