Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:10 AM

మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

06-01-2026 577 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. ముతవల్లి, ముజావర్ ఎండి జానీ పాషా నివాసం నుండి గంధం ఊరేగింపుతో ఉత్సవాలకు ఆరంభం పలికారు. అనంతరం మౌలాలి దర్గా వద్ద నైవేద్యంగా గంధం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు సుఖశాంతులతో, ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఉత్సవాల్లో ఉపసర్పంచ్ మోటె రమేష్, నాయకులు ఎండి జమీరుద్దీన్, వనం చంద్రశేఖర్, జెల్ల వెంకటేశం, ఎండి అక్రమ్, ఎండి నాసర్, వార్డు సభ్యులు హరిబాబు, కొమ్ము శేఖర్, నూర్జహా అన్వర్, అంజద్, కొమ్ము రామస్వామి, గొరిగే శేఖర్, సుదర్శన్ తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉర్సు ఉత్సవాలు భక్తుల సందడితో ఉత్సాహంగా కొనసాగాయి.
Sthanikam

మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News