Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

మన వార్డు మన బాధ్యత – పరిశుభ్రతతోనే ఆరోగ్యం నీర్నెముల 7వ వార్డులో శుభ్రత కార్యక్రమం

30-01-2026 232 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నీర్నెముల గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ అన్నారు. శుక్రవారం రోజున వార్డులోని వివిధ వీధుల్లో సిబ్బందితో కలిసి మోరీలు, చెత్తను తొలగించే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండ్ల వద్ద లేదా మోరీల వద్ద చెత్తను వేయకూడదని ప్రజలకు సూచించారు. చెత్త పేరుకుపోతే మోరీలలో నీరు నిలిచి దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తొలగించిన చెత్తను కాల్చివేసి, వార్డును శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సస్యశామలంగా తీర్చిదిద్దుతానని చినపాక రమేష్ స్పష్టం చేశారు. పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Sthanikam

మన వార్డు మన బాధ్యత – పరిశుభ్రతతోనే ఆరోగ్యం నీర్నెముల 7వ వార్డులో శుభ్రత కార్యక్రమం

Article Image

మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నీర్నెముల గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ అన్నారు. శుక్రవారం రోజున వార్డులోని వివిధ వీధుల్లో సిబ్బందితో కలిసి మోరీలు, చెత్తను తొలగించే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండ్ల వద్ద లేదా మోరీల వద్ద చెత్తను వేయకూడదని ప్రజలకు సూచించారు. చెత్త పేరుకుపోతే మోరీలలో నీరు నిలిచి దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తొలగించిన చెత్తను కాల్చివేసి, వార్డును శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సస్యశామలంగా తీర్చిదిద్దుతానని చినపాక రమేష్ స్పష్టం చేశారు. పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News