Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:50 PM

మల్లన్న గుట్టపై భక్తుల మహాసంద్రం కార్తీక అమావాస్యన ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం

19-01-2026 230 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తుల రద్దీ పెరుగుతున్నా… వసతులు ఎక్కడ?

మల్లన్న ఆలయంలో కనీస సౌకర్యాల కరవు

భక్తుల ఆవేదన పట్టించుకోని అధికారులు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మండలంలోని నిధానపల్లి మల్లన్న గుట్టపై వెలసిన శ్రీ స్వయంభూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి అదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్య మాసం, అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించారు.

అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చకులు బేతోజు సత్యనారాయణ శాస్త్రి, శశిధర్ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం పట్టువస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు.ఈ కళ్యాణోత్సవంలో కొండ రాజేందర్ సరిత దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని దీపోత్సవాలు నిర్వహించి తమ కోరికలు మొక్కుకున్నారు.అనంతరం రుద్రగార్ధం ఉమాపతి, మిర్యాల ఉమాపతి, గణేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమరేందర్, కొంగర్ సురేందర్, రాపోలు అమరేందర్, ఉపేందర్‌తో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కనీస వసతుల లేమితో భక్తుల అవస్థలు

తాగునీరు, మరుగుదొడ్లు లేక మహిళలకు ఇబ్బందులు

భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా వెలసిల్లుతున్న శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో కనీస సౌకర్యాల లేమి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్నా తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది.విశాలమైన ప్రదేశం కావడంతో ముఖ్యంగా మహిళలు మలమూత్ర విసర్జనకు తీవ్ర అవస్థలు పడుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా తక్షణమే సమస్యలను పరిష్కరించి అదనపు సౌకర్యాలు కల్పించాలని భక్తులు, మహిళలు కోరుతున్నారు.

Sthanikam

మల్లన్న గుట్టపై భక్తుల మహాసంద్రం కార్తీక అమావాస్యన ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News