Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:24 AM

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్‌లో భారీ చేరికలు

03-02-2026 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా బిజెపి యువ నాయకుడు, 46వ వార్డు మాజీ కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి, 17వ వార్డు కాంగ్రెస్ నాయకులు మల్లయ్య జ్యోత్స్న, 27వ వార్డు మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకురాలు సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మతో పాటు సుమారు వందమంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. అభివృద్ధి అంటే పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే జరిగిందని తెలిపారు. అభివృద్ధిని కాంక్షించే ప్రజలు, నాయకులు బిఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఇస్లావత్ రాంచంద్ర నాయక్, రాష్ట్ర కార్యదర్శి వైవి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు గోపగాని వెంకట నారాయణ గౌడ్, జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మారిపెద్ధి శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, కీసర వేణుగోపాల్ రెడ్డి, సిరివెళ్ల శబరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్‌లో భారీ చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News