Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:14 AM

మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ఘన సన్మానం

12-01-2026 354 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్‌లోని సుదరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ప్రత్యేకంగా సన్మానం అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, గద్వాల్ మాజీ జడ్పీ చైర్మన్ సరిత అక్క, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా మోట్ రమేష్‌ను శాలువాతో సత్కరించి స్మారక చిహ్నాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, గ్రామ పాలనలో ఉపసర్పంచ్‌ల పాత్ర కీలకమని, ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రతినిధులు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
ఈ సన్మాన కార్యక్రమంలో బండ లింగస్వామి, మోట్ మహేష్, సిందం వేణు, మధు తదితరులు పాల్గొని మోట్ రమేష్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో సమర్థవంతమైన పాలనకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
Sthanikam

మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News