Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:29 PM

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

24-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం రూపొందించిన పోస్టర్‌ను స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన తెలిపారు.

జిల్లా కేంద్రంలోని ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జయమ్మ, రెసిడెన్షియల్ సమన్వయ అధికారి శ్రీకాంత్, ఉర్దూ మైనార్టీ అధికారి ఫౌజియా, మైనార్టీ రెసిడెన్షియల్ సంస్థల ప్రిన్సిపాళ్లు బాలకృష్ణ, శ్రీనివాస్, కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ముస్లిం మైనార్టీ విద్యార్థులు పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వసతి, భోజనం, విద్య వంటి సౌకర్యాలతో కూడిన ఈ విద్యాసంస్థలు మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మైనార్టీ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అధికారులు సూచించారు.

Sthanikam

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం రూపొందించిన పోస్టర్‌ను స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన తెలిపారు.

జిల్లా కేంద్రంలోని ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జయమ్మ, రెసిడెన్షియల్ సమన్వయ అధికారి శ్రీకాంత్, ఉర్దూ మైనార్టీ అధికారి ఫౌజియా, మైనార్టీ రెసిడెన్షియల్ సంస్థల ప్రిన్సిపాళ్లు బాలకృష్ణ, శ్రీనివాస్, కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ముస్లిం మైనార్టీ విద్యార్థులు పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వసతి, భోజనం, విద్య వంటి సౌకర్యాలతో కూడిన ఈ విద్యాసంస్థలు మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మైనార్టీ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News