మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి
మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి
Sthanikam District Staff Reporter
- ఐద్వ జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్
(అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా)పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ బట్టుపల్లి శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ ఉదయగిరి శ్రీనివాస్ మాజీ ఐలు జిల్లా నాయకులు గార్ల అమరవీరుల జ్ఞాపకార్ధంగా బహార్ పేటలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ హాజరై మాట్లాడుతూ...మహిళలపై అనేకదాడులు జరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకుప్రతీకంగా నిలిచే సంక్రాంతి పండగ అని,ముగ్గులు వేయడంలో మహిళల యొక్క సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు హత్యలు ఎక్కువయ్యాయని పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలను ఆ చట్టాలను పటిష్టం చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళుతున్న తరుణంలోమనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తూ..మహిళలను వంటింటికే పరిమితం చేయాలనీ మనువాదం మహిళల హక్కులను అనిచివేస్తుందని ఆ మనువాదాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణీతలుగా జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి,పట్టణ కమిటీ సభ్యురాలు గద్దె లత,జిల్లా కమిటీ సభ్యురాలు,పట్టణ అధ్యక్షురాలు మాయ రాణి,పట్టణ కోశాధికారిగంధ మల్ల బాలమణి,ఎన్ పిఆర్ డి కొత్త లలిత,దండు స్వరూప,కార్యక్రమం అనంతరం పోటీలో పాల్గొన్న వారందరికీ బహుమతులు ప్రధానోత్సవం చేయడంజరిగింది. మొదటి బహుమతి బండారుకవిత,రెండవ బహుమతి ఆడపు చందన,మూడవ బహుమతి సాద్విక,ఈ కార్యక్రమంలో బండారు యాదమ్మ,బట్టుపల్లి జయశ్రీ,శ్యామల,అంజలి సునీత,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి