Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:24 PM

మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక చేయూత: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

19-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

మహిళల ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలో వడ్డీ లేని రుణాల పథకం కింద పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌లతో కలిసి ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల మంజూరు, అర్హులైన సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని అర్హులైన మహిళలను రేషన్ కార్డుల ఆధారంగా గుర్తించాలని, పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి రద్దీ లేకుండా సక్రమమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మెప్మా అధికారి రమేష్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక చేయూత: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News