Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

మహిళల భద్రతకు అవగాహనే రక్షణ వెంకటాపురం కాలనీలో “మీ రక్షణ – మా బాధ్యత” కార్యక్రమం

21-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో మహిళలపై జరుగుతున్న నేరాల నివారణకు అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన “మీ రక్షణ – మా బాధ్యత” కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సంయుక్తంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ బాలికల విద్య ప్రాముఖ్యత, బాల్య వివాహాల నివారణ, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు, సైబర్ నేరాల నివారణ చర్యలపై వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళల సహాయ హెల్ప్‌లైన్ 181, మహిళల భద్రత కోసం 1091, బాలల సహాయానికి 1098, సైబర్ మోసాల ఫిర్యాదులకు 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు. అవసరమైతే పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలికలు విద్య ద్వారా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసం, అవగాహనతో తమ హక్కులను తెలుసుకుని ముందుకు సాగాలని సూచించారు. బాల్య వివాహాలు, మహిళలపై నేరాల నివారణలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కీలకమని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఎమ్మిగనూరు రూరల్ సీఐ, టౌన్ ఎస్‌ఐ, నందవరం ఎస్‌ఐ, మున్సిపల్ కమిషనర్, ఎమ్మిగనూరు ఎంఆర్వో, రాష్ట్ర కుర్నీ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు, బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్, వీఎచ్‌పీ నాయకులు, మహిళా ప్రతినిధులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల భద్రతకు అవగాహనే రక్షణ వెంకటాపురం కాలనీలో “మీ రక్షణ – మా బాధ్యత” కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News