Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:50 PM

మహిళా ఉద్యోగినిపై దుర్వ్యవహారం ఘటనకు కాంగ్రెస్‌కు సంబంధం లేదు

మహిళా ఉద్యోగినిపై దుర్వ్యవహారం ఘటనకు కాంగ్రెస్‌కు సంబంధం లేదు

మహిళా ఉద్యోగినిపై దుర్వ్యవహారం ఘటనకు కాంగ్రెస్‌కు సంబంధం లేదు
February 24, 2026 06:52 PM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


చట్టపరమైన చర్యలు పోలీసుల పరిధిలోనే – సీపీఐ ఆరోపణలు తప్పుడు ప్రచారం అంటూ మండిపాటు

ఏదులాపురం, ఫిబ్రవరి 24: మహిళా ఉద్యోగినిపై దుర్వ్యవహారం చేసిన ఘటనలో చట్టపరమైన చర్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. తప్పుడు పనులు చేస్తూ అధికార పార్టీపై బురదజల్లడం సీపీఐ నాయకులకే చెల్లిందని విమర్శించారు. వరంగల్ క్రాస్ రోడ్డులోని 29వ వార్డులో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ విధుల్లో భాగంగా గృహ నిర్మాణ శాఖ సిబ్బందితో వచ్చిన మహిళా ఉద్యోగినిని వందలాది మంది ముందే ఏదులాపురం మాజీ సర్పంచ్, సీపీఐ ఖమ్మం గ్రామీణ మండల నాయకుడు చెరుకుపల్లి భాస్కర్ దుర్భాషలాడారని ఆరోపించారు. ఈ ఘటనపై బాధితురాలు ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ సీపీఐ నాయకులు వాటిని పట్టించుకోకుండా వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా ఉద్యోగినిపై అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేయకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులపై అవాకులు చెవాకులు పేల్చడం సరికాదన్నారు. సీపీఐపై రాజకీయ కక్షలు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని, కానీ నిజాలను వక్రీకరించి ఆరోపణలు చేయడం అంగీకరించబోమన్నారు. సోషల్ మాధ్యమాల్లో ప్రజలు స్వయంగా వీడియోలు చూసారని, వాటిని సరిదిద్దుకోవాలనే మనసు సీపీఐ నాయకులకు లేకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి కాంగ్రెస్‌పై ఆరోపణలు మానుకోవాలని, గుడ్డ కాల్చి మీదేసే ధోరణి విడిచిపెట్టాలని సీపీఐ నాయకులకు హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, 29వ వార్డు కౌన్సిలర్ వెంపటి ఉమా వెంకటేశ్వర్లు, భూక్యా సురేష్ నాయక్, వెంపటి రవి, వెంపటి సురేష్, ప్రద్యుమ్న చారి, నూకల రామ్మోహన్ రెడ్డి, శిరిషా రంజిత్ రెడ్డి, కళ్ళెం శేషిరెడ్డి, ఎర్ర శేఖర్ రెడ్డి, రామిశెట్టి రమేష్, అశోక్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, సురేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News