Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ పౌర్ణమి వేళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:36 PM

మహిళా న్యాయవాదిపై హత్య… న్యాయవ్యవస్థను కుదిపేసిన అమానుషం!

05-02-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్వప్న హత్యకు నిరసనగా కోర్టు ముందర మహిళా న్యాయవాదుల గర్జన

మహిళా న్యాయవాది స్వప్నను అమానుషంగా హత్య చేసిన ఘటనకు నిరసనగా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట తీవ్ర ఆందోళన చేపట్టారు. నిన్న చేవెళ్ల బార్ అసోసియేషన్‌కు చెందిన మహిళా న్యాయవాది స్వప్నపై జరిగిన హత్య న్యాయవ్యవస్థను కలచివేసిందని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుంటూరు మధు, సీనియర్ న్యాయవాదులు వసంత సత్యనారాయణ పిల్లే, మహిళా న్యాయవాది సరిత మాట్లాడుతూ స్వప్న హత్యను తీవ్రంగా ఖండించారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించిన పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

న్యాయం కోసం కక్షిదారుల తరఫున పోరాడే న్యాయవాదులకు సరైన రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా న్యాయవాదులు రోజువారీ విధుల్లో భయాందోళనల మధ్య పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే న్యాయవాదుల పరిరక్షణకు చట్టాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు గాదె రమాదేవి, తల్లమల్ల హసేన్, బొమ్మగాని శ్రీను, దాసరి వెంకటేశ్వరరావు, కోకా రంజిత్ కుమార్, పోలబోయిన నరసయ్య, కట్ట సుధాకర్, మీసాల శ్రీనివాస్, బచ్చలకూరి గోపి, చంద్రకాంత్, సందీప్‌తో పాటు పలువురు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా న్యాయవాదిపై హత్య… న్యాయవ్యవస్థను కుదిపేసిన అమానుషం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News